భరత్ అనే నేను షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన మహేష్ బాబు!

ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో  రెండో మూవీ సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. మురుగదాస్ దర్శకత్వంలో అటు స్పైడర్ మూవీ పనుల్లో పాల్గొంటూనే భరత్ అనే నేను షూటింగ్ కి మహేష్ హాజరయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. కారణం స్పైడర్. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. విదేశాల్లో ఈరోజు సాయంత్రం ప్రీమియర్ షో వేయనున్నారు. కోలీవుడ్ లో ఈ మూవీ ద్వారా అడుగు పెడుతుండడంతో మహేష్ గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.

మొన్నటి వరకు తమిళ మీడియాకి పలు ఇంటర్వ్యూ లు ఇచ్చిన మహేష్, నిన్న ఈరోజు తెలుగు టీవీ, వెబ్ చానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సినిమా విశేషాలను చెబుతున్నారు. రేపటితో ఈ బిజీ తగ్గనుంది. అనంతరం కొరటాల శివ షూటింగ్ మళ్ళీ మొదలుకానుంది. రాజకీయనేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి  బాగా నవ్విస్తారని తెలిసింది. బాలీవుడ్ బ్యూటీ  కైరా అద్వానీ (ధోనీ ఫేమ్) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్  సంగీతాన్ని అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus