విభిన్న కథలను ఎంచుకుంటున్న మహేష్ బాబు!

అపజయాలు ఎదురైనా మహేష్ బాబు రూటు మార్చుకోలేదు. గతంలో నిజం, నాని, ఖలేజా వంటి వన్నీ విభిన్నమైన కథలే.. అవి నిరాశపరిచినప్పటికీ కొత్త కథలను ఎంపిక చేసుకోవడంలో వెనుకడుగు వేయడం లేదు.  స్పైడర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అను నేను” సినిమాను పట్టాలెక్కించారు. ఇది మాస్ ఆడియన్స్ కి ఇష్టమైన పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ స్టోరీ. రాజకీయాలను పూర్తి స్థాయిలో తొలిసారి టచ్ చేస్తున్నారు. దీని తర్వాత వంశీ పైడిపల్లితో తన 25వ సినిమాను చేయనున్నారు. దీనిని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినిదత్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు.

అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ క్లాస్ సినిమా అని చెప్పవచ్చు. ఆ తర్వాత చేసే సినిమా మాస్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు. మాస్ డైరక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూడు సినిమాల మధ్యలో రాజమౌళి దర్శకత్వంలోనూ మరో సినిమా ఉండనుంది. ఈ నాలుగు కథలు డిఫెరెంట్ గా ఉండనుందని డైరెక్టర్లను బట్టి సులువుగా చెప్పవచ్చు. మరి వీటిలో ఏది కమర్షియల్ హిట్ అవుతుందో.. నటన పరంగా మహేష్ కి మంచి పేరు ఏ స్టోరీ తెస్తుందో .. ప్రేక్షకులే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus