ఏంటి ఇలా కూడా కొట్టుకుంటారా అని ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఎలాంటి విషయం మీదైనా గొడవలు జరగొచ్చు. నిన్న అమేజాన్ ప్రైమ్ వాడు సరదాగా “5000 రీట్వీట్స్ వస్తే కేజీఎఫ్ సినిమాను విడుదల చేస్తాం” అని పోస్ట్ చేసిన గంటలోనే 5000 రీట్వీట్స్ రావడంతో వెంటనే సారీ 5000 రీట్వీట్స్ వస్తే కేజీఎఫ్ చిత్రాన్ని ఆన్ లైన్ లో ఎప్పుడు విడుదల చేస్తామనేది చెప్తామ్ అనడం పెద్ద సెన్సేషన్ అయిపోయింది. వెంటనే “బ్యాన్ అమేజాన్ ప్రైమ్” అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కూడా అయిపోయింది. దాంతో భయపడిన అమేజాన్ టీం లేట్ చేయకుండా ఇవాళ సాయంత్రమే సినిమాను ఆన్ లైన్ లో విడుదల చేశారు. అలా ఉంది ప్రస్తుతం ఇంటర్నెట్ లో, ముఖ్యంగా ట్విట్టర్ లో సిచ్యుయేషన్.

నిన్న “మహర్షి” సినిమా నుంచి ఒక కొత్త స్టిల్ వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ బాబు గట్టిగా కావలించుకున్న పూజా హెగ్డే స్టిల్ అప్పటికప్పుడు వైరల్ కూడా అయిపోయింది. వైరల్ అయిన ఫోటోతోపాటు కొన్ని కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. అదేంటంటే.. “అరవింద సమేత” చిత్రంలో ఎన్టీఆర్ ఎప్పుడు దగ్గరకి వచ్చినా పూజా “స్పేస్ కావాలి” అని అడుగుతుంటుంది. కానీ.. మహేష్ ని మాత్రం స్పేస్ లేనంతగా కౌగిలించుకుంది. దాంతో ఎన్టీఆర్ అంటే పూజాకి ఇష్టం లేదు కాబట్టే స్పేస్ కావాలి అని అడిగింది, మహేష్ అంటే ఇష్టం కాబట్టి కౌగిలించుకుంది అని కామెంట్స్ చేయడం మొదలెట్టారు. అది కాస్తా ట్విట్టర్ లో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus