మాటల మాంత్రికుడిని పక్కన పెట్టిన మహేష్

  • August 14, 2018 / 04:13 AM IST

క్రీస్తు శకాన్ని ఎలా అయితే క్రీస్తుకి ముందు, క్రీస్తు తర్వాత అని పేర్కొంటామో.. అలాగే త్రివిక్రమ్ కెరీర్ ను “అజ్ణాతవాసి”కి ముందు “అజ్ణాతవాసి”కి తర్వాత అని చెప్పుకోవాలేమో. అదృష్టం బాగుండి “అజ్ణాతవాసి” రిలీజ్ కి ముందే మొదలెట్టడంతో ఎన్టీఆర్ తో “అరవింద సమేత” సెట్స్ మీదకు వెళ్లగలిగిందేమో కానీ.. లేదంటే త్రివిక్రమ్ కూడా పవన్ కళ్యాణ్ తరహాలో సినిమాలు మానేయాల్సి వచ్చేదేమో. ఆ సినిమా రిజల్ట్ అలాంటిది. కానీ.. ఎన్టీయార్ కు త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతో ప్రొజెక్ట్ ను స్టార్ట్ చేశాడు.

అయితే.. త్రివిక్రమ్ ను ఎన్టీఆర్ నమ్మినంతగా మహేష్ బాబు నమ్మలేదేమో అనిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. “ఖలేజా” తర్వాత సినిమాలకంటే ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ చేసిన మహేష్ బాబు దాదాపు తాను నటించిన లేదా ప్రచారకర్తగా వ్యవహరించిన బ్రాండ్స్ యాడ్ షూట్స్ అన్నిటికీ త్రివిక్రమ్ డైరెక్ట్ చేయాలని అడిగేవాడు. కానీ.. “అజ్ణాతవాసి” రిజల్ట్ అనంతరం మహేష్ బాబు నటించే యాడ్స్ కి మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్స్ డైరెక్ట్ చేయడం మొదలెట్టారు. ఇక ఇటీవల “అభి బస్” యాడ్ కు మహేష్ తనకు కొత్తగా స్నేహితుడిగా మారిన కొరటాల శివతో డైరెక్ట్ చేయించుకొన్నాడు. పరాజయం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందని తెలుసు కానీ.. మరీ ఈ రేంజ్ లో ఉంటుందని మాత్రం అస్సలు ఊహించలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus