సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మహేష్ ఏకంగా 30 కోట్ల ప్రాజెక్టు ను వదులుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. బ్రహ్మోత్సవం సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా.. మహేష్ క్రేజ్ మాత్రం తగ్గలేదు.
భారీ పారితోషకాలు ఆఫర్ చేసి మరీ తనను సినిమాలో నటించమని అడుగుతున్నారు. ఈ నేపధ్యంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుందర్ సి, తెలుగు, తమిళ బాషల్లో భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దీని కోసం మహేష్ ను సంప్రదించారట. అంతేకాదు మహేష్ కెరీర్ లో ఇప్పటివరకు అందుకోని పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయినా.. సరే మహేష్ మాత్రం నటించనని చెప్పేసారట.
సుందర్ ఎంతగా కన్వీన్స్ చేయడానికి ప్రయత్నించినా.. మహేష్ మాత్రం ఒప్పుకోలేదట. రెండు సినిమాలు చేస్తూ.. దర్శకులను కన్ఫూజ్ చేయడం ఇష్టం లేకే మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.