సుకుమార్ ను ఇబ్బంది పెడుతున్న మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నాడు. మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్, పివిపీ సంస్దలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం మొదలైనప్పుడే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు మహేష్. తన 26 వ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో అలాగే తన 27వ చిత్రాన్ని ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.

మహేష్ 26 సుకుమార్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కథ నచ్చకపోవడంతో సుకుమార్ ను తెగ ఇబ్బంది పెడుతున్నాడంట మహేష్. దీనికి ప్రధాన కారణం గతంలో మహేష్- సుకుమార్ కంబినేషన్లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ చిత్రం డిజాస్టర్ కావడమే అని.. అందుకు ఈ సారి స్క్రిప్ట్ పక్కాగా చూసుకున్న తరువాతే సెట్స్ పైకి తీసుకు వెళ్ళేలాగా మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడంటూ ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా సుకుమార్ ఒక పీరియాడికల్ స్టోరీ చెప్పగా ఆ కథ నచ్చలేదంటూ మహేష్ రిజెక్ట్ చేశాడంట. అంతే కాదు జనవరి లోపు మంచి స్క్రిప్ట్ తో రమ్మని ఒక డెడ్ లైన్ కూడా పెట్టాడంట. ఒక వేళ సుకుమార్ కథ వర్కౌట్ కాకపోతే కొరటాల శివ ఎలాగూ మహేష్ కోసం మంచి స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడంటూ ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus