మహేష్ బాబు మేకప్‌మెన్ ఇంటికి వెళ్లి పరామర్శించిన నమ్రత.. కారణం ఏంటంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబుకి తండ్రి కృష్ణ గారి నుండి కేవలం నట వారసత్వం, సూపర్ స్టార్ అనే ట్యాగ్ మాత్రమే కాదు.. ఆయన మంచితనం, గుణగణాలు కూడా వచ్చాయి. చాలా వరకు తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకున్నాడు మహేష్.. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు, గ్రామాల దత్తత.. ఇలా చాలా మంచి పనులు చేస్తుంటారు. అలాగే తమ వద్ద పనిచేసే స్టాఫ్‌ని కానీ..

ఇంట్లో పని చేసే వాళ్లని కానీ ఎంతో అభిమానంతో.. ఇంట్లో మనుషుల్లా చూసుకుంటారని అంటుంటారు. వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు వద్ద పట్టాభి చాలా సంవత్సరాలుగా మేకప్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల పాటు కృష్ణ గారి వద్ద కూడా పని చేశాడని చెప్తుంటారు. ఘట్టమనేని ఫ్యామిలీతో ఆయనకు ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉంది. మహేష్ బాబు కూడా పట్టాభిని ఎంతో మర్యాదగా చూసుకుంటాడు. రీసెంట్‌గా పట్టాభి ఇంట విషాదం చోటు చేసుకుంది.

శోకసంద్రంలో మునిగిపోయిన ఆ కుటుంబాన్ని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు మహేష్ సతీమణి నమ్రత.. మహేష్ స్పెయిన్‌లో ఉండడంతో రావడం వీలు పడలేదు..పట్టాభి తండ్రి వయసు పై బడడం, వృద్ధాప్య సమస్యల కారణంగా శనివారం (ఫిబ్రవరి 11) ఉదయం కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే మహేష్ బాబు భార్య నమ్రత వారింటికి విచ్చేసి.. కుటుంబసభ్యులందరినీ పరామర్శించారు.. పట్టాభి తండ్రి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులర్పించారు.

తాను రాలేకపోయినా పట్టాభి కుటుంబాన్ని పరామర్శించడానికి భార్యను పంపి తన మంచి మనసు చాటుకున్నాడు మహేష్. నమ్రత వచ్చి ధైర్యం చెప్పడం ఆ కుటుంబానికి కొంతలో కొంత ఓదార్పునిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సినీ పరిశ్రమ వారు, సన్నిహితులు, మహేష్ బాబు అభిమానులు పట్టాభి తండ్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. మహేష్ హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత పట్టాభి ఇంటికి వచ్చే అవకాశముంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus