Mahesh, Soundarya: మహేష్ బాబు మిస్ చేసిన సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన స్టార్ కమెడియన్..

చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆయన దివంగత నటి సౌందర్య కాంబినేషన్లో ఓ సినిమా తీయాల్సి ఉంది. కానీ అది మిస్ అయిందన్న సంగతి చాలా మందికి తెలియదు. నిజం.. దాదాపు పాతికేళ్ల క్రితం ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంతో వచ్చిన సినిమా యమలీల. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్. ఈ చిత్రంలో అలీ, ఇంద్రజ హీరో, హీరోయిన్లుగా నటించారు.

నవరస నటనా సార్వభౌను కైకాల సత్యనారాయణ యముడు పాత్రలో జీవించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అలీకి హీరోగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ క్రమంలో అలీ హీరోగా నటించిన చాలా చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఇటు హీరోయిన్ గా చేసిన ఇంద్రజకు కూడా ఆఫర్లు బాగానే వచ్చాయి. హీరోయిన్ గా టాలీవుడ్ లోని దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది.దర్శకుడు కృష్ణారెడ్డి కెరీర్ లో ఈ సినిమా మైలురాయిగా నిలిచిపోయింది.

అయితే ఈ సినిమా కథను ఎస్వీ కృష్ణారెడ్డి మొదటిగా (Mahesh) మహేష్ బాబు, సౌందర్యతో తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ ఈ సినిమా సమయానికి మహేష్ బాబు వయసు.. కేవలం 19ఏళ్లు మాత్రమే.. అప్పటికే సౌందర్య వయసు 22 ఏళ్లు. మహేష్ బాబు కన్నా సౌందర్య మూడేళ్లు పెద్ద. దర్శకుడు కృష్ణారెడ్డి సూపర్ స్టార్ కృష్ణకు ఈ సినిమా కథ వినిపించగా చాలా బాగుంది.. కానీ మహేష్ చిన్నపిల్లాడు..

అప్పుడే ఇలాంటి పెద్ద కథలో నటిస్తే దానికి న్యాయం చేయలేడేమో.. వేరే హీరోతో చేయమని ఎస్వీ. కృష్ణారెడ్డికి కృష్ణ సలహా ఇచ్చారట. ఆ తర్వాత ఐదేళ్లకి మహేశ్ బాబు రాజకుమారుడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అలా సౌందర్య తో యమలీల సినిమా మహేశ్ చేజారింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus