చెన్నై వెళ్లనున్న మహేష్ బాబు.!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నెలలో చెన్నై వెళ్లనున్నారు. తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  హైదరాబాద్ లో గతనెల ప్రారంభమైన మొదటి షెడ్యూల్ రెండు రోజుల క్రితం విజయవంతగా ముగిసింది. ఈ చిత్రీకరణలో ప్రిన్స్ తో పాటు ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా పాల్గొంది. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ బాబు నటిస్తున్న ఈ ఫిల్మ్ ని ఠాగూర్ మధు తెలుగు, తమిళం రెండు భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నారు.

ఈ మూవీ రెండో షెడ్యూల్ ఈ నెల 22 న మొదలుకానుంది. ఇందుకోసం సినీ బృందం చెన్నై కు బయలు దేరనుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ నుంచి ఎస్.జె.  సూర్య మురుగదాస్ టీమ్ తో జాయిన్ కానున్నారు. అయన ఇందులో విలక్షణమైన విలన్ గా నటించనున్నారు. అయన నటన సినిమాకు హైలెట్ అవుతుందని చిత్ర బృందం ధీమా గా ఉంది. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ బాబు చేస్తున్న ఈ మూవీ టైటిల్ ని దసరాకు విడుదల చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus