Mahesh Babu: మహేష్ మూవీ కోసం వాళ్లను రప్పిస్తున్నారా..?

అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లలో మహేష్, త్రివిక్రమ్ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగింది. అటు మహేష్ ఇటు త్రివిక్రమ్ వరుస విజయాలతో జోరుమీదున్నారు. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు స్కోప్ ఉండగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేయనున్నారు. సైరా, ఆర్ఆర్ఆర్ సినిమాల కోసం పని చేసిన టెక్నీషియన్స్ ఈ సినిమా కొరకు పని చేయనున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ మహేష్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే మహేష్ కు జోడీగా పూజా హెగ్డేను త్రివిక్రమ్ ఎంపిక చేయడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. ఇప్పటికే మహేష్ పూజా హెగ్డే కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చింది.

మహేష్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేస్తే బాగుంటుందని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో కూడా పలువురు హీరోయిన్లను త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో రిపీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలియానా, సమంత, పూజా హెగ్డేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో చాన్స్ ఇవ్వడం గమనార్హం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus