Mahesh: త్రివిక్రమ్ మూవీ తర్వాత బాబీతో మహేష్ సినిమా… నిజమేనా?

మహేష్ బాబు ప్రస్తుతం చాలా బిజీ. త్రివిక్రమ్ తో ఆల్రెడీ ఓ సినిమా మొదలుపెట్టాడు. మహేష్ – త్రివిక్రమ్ ల కాంబోలో సినిమా మొదలైతే అది అంత ఈజీగా కంప్లీట్ అవ్వదు అనే సెంటిమెంట్ ‘అతడు’ నుండి ఉంది. అందుకు తగ్గట్టుగానే మహేష్.. షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి విదేశాలకు చెక్కేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా 2024 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయడం పక్కా కాబట్టి.. ఆ తర్వాత మహేష్ ప్రాజెక్టులు ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ ఉంది.

రాజమౌళితో సినిమా అయితే ఉందని క్లారిటీ ఇచ్చేశారు. అందుకు తగ్గ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.ఇండియన్ సినిమాకి ‘ఆస్కార్’ అవార్డు తెప్పించాక రాజమౌళి ఇమేజ్ మారింది. మహేష్ తో రాజమౌళి చేసే సినిమా పాన్ వరల్డ్ మూవీ అవుతుంది. అందుకే రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. ఇందుకోసం అతను ఇంకో రెండేళ్లు టైం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ లోపు మహేష్ ఖాళీగా ఉండకుండా ఓ సినిమా చేస్తే రూ.60 కోట్లు పారితోషికం లభిస్తుంది.

‘మైత్రి’ వారి అడ్వాన్స్ (Mahesh) మహేష్ వద్ద ఉంది. గోపీచంద్ మలినేనితో ఓ కథ చెప్పించారు. కానీ ఆ కథ పై మహేష్ కు ఇంట్రెస్ట్ లేదు. దీంతో దర్శకుడు బాబీ వద్ద రెడీగా ఉన్న ఇంకో కథని కూడా వినిపించారు. ఇది మహేష్ ను అట్రాక్ట్ చేసింది. అలా అని ఓకే చెప్పలేదు. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తో బాబీ ఇమేజ్ రెండింతలు పెరిగింది. కాబట్టి.. మహేష్ లో ఈ పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. ఒకవేళ మహేష్ ఈ ప్రాజెక్టుని ఫైనల్ చేస్తే మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ అయినట్టే..!

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus