Mahesh Babu P: ఆ వయసులో అలా చేసేశా.. కోలుకోవడానికి పదేళ్లు పట్టింది.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

ఒక వీకెండ్‌ సినిమా వాళ్ల జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అంటే ఆ వీకెండ్‌లో వచ్చే వారి సినిమా ఫలితం బట్టే నెక్స్ట్‌ ఏంటి అనేది చెప్పొచ్చు. ఇలా వారంతం చాలామంది కెరీర్‌ని అంతం చేసేసింది అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా దర్శకులకే వస్తుంటుంది. వారిలో కొంతమంది ఆ పరిస్థితిని దాటి ముందుకొచ్చి.. తిరిగి హిట్‌ ట్రాక్‌ ఎక్కితే.. ఇంకొంతమంది అక్కడదితో కెరీర్‌ని ముగించేస్తుంటారు. మరికొందరు ముగిసిపోయింది అనుకున్న కెరీర్‌ని తిరిగి ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్నళ్లు ఉన్నారు. వాళ్లని హీరోలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఓ హీరో మహేష్‌బాబు.పి.

Mahesh Babu P

‘రారా కృష్ణయ్య’ అంటూ 2014లో సందీప్‌ కిషన్‌తో కలసి వచ్చిన దర్శకుడు మహేష్‌బాబు.పి. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణమైన ఫలితం పొందింది. దీంతో పరిశ్రమలో మళ్లీ కనిపించలేదు. అయితే ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ‘రారా కృష్ణయ్య’ సినిమా కథ మహేష్‌ది కాదు. ఏ లైఫ్‌ లెస్‌ ఆర్డినరీ అనే సినిమా ఆధారంగా రాసుకున్న కథ ఆ సినిమా. ఆ సినిమా హాలీవుడ్‌లోనే బాగా ఆడలేదు. ఇక్కడ ట్రై చేస్తే వర్కవుట్‌ అవుతుందేమో అని కూడా ఇక్కడా ఆడలేదు.

రామ్‌ పోతినేనితో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమా చేశారు మహేష్‌బాబు.పి. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వస్తే.. ‘రారా కృష్ణయ్య’ సినిమా టాపిక్ వచ్చింది. అప్పుడు ఆయన మాట్లాడుతూ మెచ్యూరిటీ లేని వయసులో తీసిన సినిమా అది. ఏదోలా డైరెక్టర్ అయిపోవాలనే ఆలోచనతో అలా చేశా. ఆ సినిమా నాకు చాలా విషయాలు నేర్పింది. నన్ను నేను కొత్తగా సిద్ధం చేసుకునే అవకాశం ఇచ్చింది అని మహేష్‌బాబు.పి చెప్పారు. ఇప్పుడు ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ మీద భారీ ఆశలతో ఉన్నారాయన.

చిన్న వయసులోనే “నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు” లో అల్లు అర్హ…..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus