మహేష్ బాబు మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయితే సూపరే..!

స్టార్ హీరోలు ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే ఒకేసారి ‘వకీల్ సాబ్’ అలాగే క్రిష్ డైరెక్షన్లో చెయ్యబోయే చిత్రాలను మొదలుపెట్టాడు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఈ లిస్ట్ లో చేరనున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు ప్రస్తుతం ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం చెయ్యడానికి రెడీ అయ్యాడు.

దాంతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చెయ్యడానికి ఓకే చెప్పాడట. నిజానికి ‘సర్కారు వారి పాట’ చిత్రం మొదటి షెడ్యూల్ అమెరికాలో మొదలుకావాల్సి ఉంది. కానీ చిత్ర యూనిట్ సభ్యులకు వీసాల సమస్య తలెత్తడంతో ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. దాంతో 2021 వరకూ ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదట. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమాని మొదలుపెట్టి సాద్యమైనంత త్వరగా దానిని పూర్తిచేసెయ్యాలని మహేష్ భావిస్తున్నాడట.

ఎన్టీఆర్.. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయ్యేలోపు మహేష్- త్రివిక్రమ్ సినిమా పూర్తయిపోవాలి అనేది డీల్ అని తెలుస్తుంది. ఈ క్రమంలో పరశురామ్ సినిమాతో పాటు త్రివిక్రమ్ సినిమాని కూడా ఒకేసారి పూర్తి చేసేయాలని మహేష్ ఆలోచన.ముందుగా మహేష్-త్రివిక్రమ్ ల సినిమా మొదలవుతుంది. మహేష్ బాబు లేని సన్నివేశాలను మొదట ‘సర్కారు వారి పాట’ టీం 2021 ప్రారంభంలో మొదలుపెట్టనుంది. మహేష్ ప్లాన్ బాగానే ఉంది.. వర్కౌట్ అవుతుందా అనేది పెద్ద ప్రశ్న.. !

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus