ఖైదీ 150 ఫస్ట్ లుక్ కి మహేష్ అభినందనలు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు కి మెగాస్టార్ చిరంజీవి థాంక్స్ చెప్పారు. ఎందుకు చెప్పారంటే.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా నిన్న(సోమవారం) రాత్రి పార్క్ హ‌య‌త్ హోట‌ల్లో గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ కుటుంబ సభ్యులతో పాటు  సినీ పరిశ్రమకు చెందిన హీరోలు, డైరక్టర్లు హాజరయ్యారు. వీరిలో రవితేజ, శ్రీకాంత్, అఖిల్, రాశీఖన్నా, ప్రగ్య జైస్వాల్ తదితరులున్నారు. పార్టీలకు చాలా దూరంగా ఉండే మహేష్ బాబు ఇక్కడకు రావడంతో అతను ఈవెంట్ లో  సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ గా నిలిచారు.

అంతేకాకుండా చిరు 150 వ సినిమా గురించి మాట్లాడి అందరినీ ఆనంద పరిచాడని తెలిసింది.  చిరు ‘ఖైదీ నంబ‌ర్ 150’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో మెగాస్టార్ లుక్స్ సూప‌ర్ గా ఉన్నాయ‌ని, ఆ పోస్ట‌ర్ చూస్తుంటే త‌న‌కు ఠాగూర్ సినిమా గుర్తుకు వచ్చిందని, ఆ సినిమా కంటే ఇది సూపర్ హిట్ అవుతుందని ప్రిన్స్ చెప్పేసరికి అక్కడున్న వారందరు చప్పట్లు కొట్టారని సమాచారం. సూపర్ స్టార్ మాటలకు సంతోషించిన మెగాస్టార్ వెంటనే అతనికి థ్యాంక్స్ చెప్పారని ఈవెంట్ కి హాజరైన వారు చెప్పారు. ఎటువంటి ఈగోలకు పోకుండా నటులను అభినందించడంలో మహేష్ ఎల్లప్పుడూ ముందుంటారని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus