ఒక ప్లాప్ వస్తే హీరోలు, దర్శకుల పరిస్థితి ఏమో కానీ.. ప్రొడ్యూసర్ కి మాత్రం ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడుతుంది. అలాంటిది ప్రొడ్యూసర్ కి వరుస ప్లాపులు పడ్డాయి అంటే.. ఇక ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి ఎంత ఘోరంగా తయారవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ నిర్మాత అనిల్ సుంకర మాత్రం ఎన్ని ప్లాపులు వచ్చిన తట్టుకుని సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నిర్మించిన ‘రాజుగాడు’ కిరాక్ పార్టీ’ ‘సీత’ అనే సినిమాలు ప్లాపులు గా మిగిలాయి. అయినప్పటికీ భారీ బడ్జెట్ పెట్టి గోపీచంద్ తో ‘చాణక్య’ సినిమా చేశాడు.
వరుస ప్లాపులతో ఉన్న హీరో గోపీచంద్ తో భారీ బడ్జెట్ పెట్టి సినిమా చేయడమంటే.. సాధారణ విషయం కాదు. అలాంటిది ఖర్చుకి వెనుకాడకుండా ‘చాణక్య’ చేశాడు. ఇక అక్టోబర్ 5 న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రెండో రోజుకి థియేటర్లు ఖాళీ అయిపోయాయి. కనీసం ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా ఎక్కువగా రాలేదు. ప్లాప్ లో ఉన్న హీరో.. ప్లాప్ లో ఉన్న డైరెక్టర్ కాబట్టి డిజిటల్ రైట్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక అనిల్ సుంకర ప్రస్తుతం మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ సినిమా నిర్మిస్తున్నాడు. ఈ ఒక్క చిత్రం హిట్టయితేనే అనిల్ సుంకర కోలుకునే అవకాశం ఉంటుంది.
ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!