“30కోట్లు”కు మహేష్ “నో” చెప్పాడు….కారణం???

ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు. శ్రీమంతుడు లాంటి భారీ హిట్ ను అందుకుని ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే “బ్రహ్మోత్సవం” లాంటి భారీ డిజాస్టర్ మహేష్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. దాదాపుగా చాలా రోజుల పాటు ఇండియా ను వదిలి ఇతర దేశాల్లో కాస్త రెస్ట్ తీసుకున్నాడు మహేష్. ఇదిలా ఉంటే….ప్రస్తుతం మహేష్ మురుగుదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కోసం మహేష్ పెద్ద త్యాగమే చేశాడు. దాదాపుగా 30కోట్ల పారితోషాకాన్ని వదులు కూనేందుకు రెడీ అయ్యాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే…‘బ్రహ్మోత్సవం’ ఫెయిల్యూర్ అయినా మహేష్ క్రేజ్ ఏమాత్రం తగ్గక పోవడంతో మహేష్ కు భారీ ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. అదే క్రమంలో కోలీవుడ్ టాప్ డైరెక్టర్ సుందర్ సి. తెలుగు తమిళ భాషలలో 350 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఫ్యాంటసీ మూవీ ‘సంఘమిత్ర’ లో నటించమని మహేష్ పై తీవ్ర ఒత్తిడి చేయడమే కాకుండా మహేష్ ఇప్పటి వరకు తన కెరియర్ లో అందుకొని 30 కోట్ల భారీ పారితోషికాన్ని ఇస్తానని సైతం చెప్పాడు.

అయితే ఆ రిక్వెస్ట్ ను సున్నితంగా తిరస్కరించాడు ప్రిన్స్. దానికి గల కారణాలు ఏంటంటే…‘బ్రహ్మోత్సవం’ ఫెయిల్యూర్ తో తీవ్ర నిరాశకు గురి కాబడ్డ మహేష్ కేవలం భారీ పారితోషికాల కోసం ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ తాను అయోమయంలో పడి దర్శకులను అయోమయంలో పడేయడం ఇష్టం లేకపోవడం వల్లనే ఇలా చేసాడని టాక్. ఏది ఏమైనా…మహేష్ బాబు సూపర్ అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus