ఫ్లాష్ బ్యాక్ : రీమేక్ సినిమా కోసం ‘పోకిరి’ వదులుకున్న రవితేజ!

మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ‘పోకిరి’ సినిమా టాప్ లో ఉంటుంది. 2006 ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్నో రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాతో దర్శకుడు పూరి, మహేష్ బాబుల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ సినిమాను ముందుగా రవితేజతో చేయాలనుకున్నారట పూరి. ఆయనకు కథ చెప్పారట. ‘సన్ ఆఫ్ సూర్యనారాయణ’ అనే టైటిల్ కూడా అనుకున్నారట.

రవితేజకి కూడా కథ బాగా నచ్చింది. పూరికి ఓకే కూడా చెప్పారు. కానీ అదే సమయంలో కోలీవుడ్ సినిమా ‘ఆటోగ్రాఫ్’ను రీమేక్ చేసే ఛాన్స్ రవితేజకి వచ్చింది. ఆ సినిమా విపరీతంగా నచ్చడంతో వెంటనే రీమేక్ చేయాలనుకున్నారు. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ అనే టైటిల్ తో సినిమాను మొదలుపెట్టారు. రవితేజ ఫ్రీ అయ్యేలోపు మరో సినిమా చేయాలనుకున్న పూరి.. ‘143’ అనే సినిమా తీశారు. రిలీజ్ కూడా అయిపోయింది కానీ రవితేజ ఇంకా బిజీగానే ఉన్నారు.

దీంతో పూరి మరో హీరోతో సినిమా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో సోనూసూద్ తో ప్రయోగాత్మకంగా సినిమా చేయాలనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా మహేష్ బాబుకి కథ చెప్పే ఛాన్స్ వచ్చింది. ఓ స్టార్ హోటల్ లో మహేష్ ని కలిసి కథ వినిపించడం మొదలుపెట్టారు పూరి. మహేష్ కి విపరీతంగా నచ్చింది. కానీ చిన్న చిన్న మార్పులు చెప్పారు.

పూరి కూడా ఓకే అన్నారు. ‘పోకిరి’ అనే టైటిల్ అనుకున్నప్పుడు మహేష్ చాలా ఎగ్జైట్ అయ్యారు. హీరోయిన్ గా మొదట అయేషా టాకియాను అనుకున్నారు. కానీ ఆమెకి కుదరక ప్రాజెక్ట్ వదులుకుంది. ఆ తరువాత పార్వతి మెల్టన్ పేరు పరిశీలనలోకి వచ్చింది. ఫైనల్ గా ఇలియానాకు బెర్త్ కన్ఫర్మ్ అయింది. 70 రోజుల్లో ‘పోకిరి’ సినిమాను పూర్తి చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ కొల్లగొట్టాడు పూరి జగన్నాధ్.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus