సుకుమార్ తర్వాత.. పూరీనే లైన్లో ఉన్నాడు..!

‘ఇస్మార్ట్ శంకర్’ తో సూపర్ హిట్టు కొట్టాడు పూరి జగన్నాథ్. ‘టెంపర్’ చిత్రం తర్వాత సుమారు నాలుగేళ్ళ తర్వాత హిట్టందుకున్నాడు. చెప్పాలంటే ‘టెంపర్’ ను మించే హిట్టు కొట్టాడని చెప్పాలి. ఎందుకంటే ‘టెంపర్’ సినిమాకి పూరి కంటే ఎక్కువ పేరు ఎన్టీఆరే కొట్టేసాడు. కానీ ఈసారి ‘ఇస్మార్ట్ శంకర్’ తో పూరి మాస్ హిట్టుకొట్టాడు అనే మార్కులు ప్రేక్షకుల దగ్గర్నుండీ వేయించుకున్నాడు. ప్రస్తుతం ఈ రెస్పాన్స్ పూరికి చాలా అవసరం. ఎందుకంటే అప్పుడే.. స్టార్ హీరోలు ఈయన వైపు కాస్త చూస్తారు. అంతా బానే ఉంది. కానీ ఒక్క విషయంలో పూరిని బాగా ట్రోల్ చేస్తున్నారు మహేష్ అభిమానులు. ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్లలో భాగంగా పూరి… ‘హిట్టున్న ద‌ర్శ‌కుల‌తోనే మ‌హేష్ సినిమాలు తీస్తాడు’ అంటూ… మ‌హేష్ బాబు పై కామెంట్ చేశాడు. మ‌హేష్ ఇప్పుడు త‌న‌తో సినిమా చేస్తాన‌ని వచ్చినా ‘నా క్యారెక్టర్’ వేరంటూ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే లేపాయి.

మ‌హేష్ ,పూరిల మధ్య మనస్పర్థలు వచ్చాయని .. ఈ స్టేట్‌మెంట్‌ని చూస్తే అర్ధమైపోతుంది. నిజం చెప్పాలంటే ‘పోకిరి’ ‘బిజినెస్ మెన్‌’ చిత్రాలకి ముందు పూరి సినిమాలు అన్నీ ఫ్లాపులే. అయినా.. మహేష్ పిలిచి మ‌రీ అవకాశమిచ్చారు. ఇప్పుడు మహేష్ సినిమా చేయాలన్నా తన కాల్ షీట్లు కాళీ లేవు. చాలా మంది దర్శకనిర్మాతలకి మహేష్ సినిమా చేస్తానని కమిట్మెంట్ ఇచ్చాడు. అందుకే పూరి సినిమా చేయడానికి వచ్చినా ‘నో’ చెప్పి పంపించేసి ఉంటాడని ఫిలింనగర్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. మొన్న ‘మహర్షి’ ప్రీ రిలీజ్ లో కూడా పూరి పేరు చెప్పలేదు మహేష్. అందుకే పూరి బాగా హర్ట్ అయ్యుంటాడని.. తన కోపాన్ని ఈరకంగా కామెంట్ చేసి తీర్చుకున్నాడని టాక్ నడుస్తుంది. ఇప్పుడు పూరి కామెంట్స్ మ‌హేష్‌బాబు వ‌ర‌కూ వెళ్ళిందట. అయితే ఈ విషయం మ‌హేష్ కూడా కౌంట‌ర్ ఇస్తాడా అనేది చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే… మ‌హేష్ ఈమ‌ధ్య అంత సైలెన్స్ మైంటైన్ చేయడం లేదు. ఇదివరకు అయితే పట్టించుకునే వాడు కాదు కానీ ఇప్పుడు వెంట‌నే కౌంటర్ ఇచ్చేస్తున్నాడు. ‘మహర్షి’ ప్రీ రిలీజ్ లో సుకుమార్‌ పై ప‌రోక్షంగా సెటైర్ వేసాడు. ఈసారీ పూరిని ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ మ‌హేష్ స్పందించే అవ‌కాశాలు లేకపోలేదంటూ వార్తలు వస్తున్నాయి. మ‌రి పూరి పంచ్‌కి మ‌హేష్ ఎలా కౌంటర్ ఇస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus