‘జీ.ఎస్.టీ’ కు మహేష్ రివర్స్ పంచ్..!

  • December 29, 2018 / 01:52 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘జీ.ఎస్.టి’ కమిషనరేట్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా తన బ్యాంక్ అకౌంటులను సీజ్ చేయడం పై ఆయన ఈ నోటీసులు జారీ చేసినట్టు స్పష్టమవుతుంది.దీనికి సంబందించిన రూ .31,47,994 ల డి.డి ని కూడా వీరికి పంపించాడు మహేష్. ఇక అన్ని టాక్సులను తను ఎప్పటికప్పుడు చెల్లించానని మహేష్ బాబు పేర్కొన్నారు. కోర్టు పరిధిలో ఉన్న బ్యాంక్ అకౌంటులను ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం కరెక్ట్ కాదని మహేష్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ విషయం పై మహేష్ బాబు స్పందిస్తూ… “నేను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడిని… హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ కోర్టు పరిధిలో ఉన్న 18 లక్షల 50 వేల రూపాయల పన్నును వడ్డీతో కలిపి 73 లక్షల 50 వేలుగా నిర్ణయించి బ్యాంక్ ఖాతాల నిలుపుదలకు ఆదేశారు, వాస్తవానికి 2007 -08 ఆర్థిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సేవలు ఎటువంటి పన్ను పరిధిలోకి రాదు”… అంటూ మహేష్ స్పష్టం చేసాడు.

అంతేకాకుండా బ్రాండ్ అంబాసిడర్ సేవలకు సంబందించిన పన్ను పరిధిలోకి సెక్షన్ 65 (105) (జెడ్.జెడ్.జెడ్.జెడ్.క్యూ) నుండీ 2010 జులై 1వ తేదీ నుంచి చేర్చారని, పన్ను చెల్లింపుదారుడు చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నప్పటికీ , ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా, పైగా ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ జీఎస్టీ కమిషనరేట్ బ్యాంకు ఖాతాల నిలుపుదలకు ఆదేశించిందని మహేష్ బాబు లీగల్ టీమ్ కూడా వివరించడం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus