Sarkaru Vaari Paata Teaser: సూపర్ డూపర్ బ్లాస్టర్ ఇది.. ఇట్స్ మహేష్ షో..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ ‘సర్కారు వారి పాట’ .’మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. మది సినిమాటోగ్రఫర్ కావడం విశేషం. ఈ ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో కొద్దిసేపటి క్రితం ఈ చిత్రం నుండీ ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ పేరుతో ఓ టీజర్ ను విడుదల చేసారు.

ఇందుములంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. అంటూ వేలం పాట ప్రకటన డైలాగ్ తో టీజర్ మొదలైంది.అటు తర్వాత ‘ఇఫ్ ఏ టైగర్ టేక్స్ ఎ రేబిట్’ అంటూ మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. అటు తర్వాత మహేష్ కి దిష్టి తీస్తూ కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చింది. ‘ ఏమయ్యా కిషోర్ … ఓ ఐదారు మూరలు ఉండవా అవి’ అంటూ మహేష్ పలికే డైలాగ్ ఆకర్షిస్తుంది. మొత్తంగా ఈ టీజర్ కి మహేష్ బాబు లుక్ హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.

అటు తర్వాత మహేష్ ను అంత గ్లామర్ గా చూపించిన మది సినిమాటోగ్రఫీ, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్ ను చెప్పుకోవచ్చు. మహేష్ ఈ టీజర్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.ఇప్పుడు అతను 46 ఏళ్ళ వయసులోకి ఎంటర్ అవుతున్నా 25 ఏళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఓవరాల్ గా ఈ బ్లాస్టర్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus