Mahesh, Shahrukh: మహేష్ బాబు – షారుఖ్ ఖాన్ ఏ విషయంలో హిస్టరీ క్రియేట్ చేశారంటే..

  • January 31, 2023 / 02:43 PM IST

బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గతకొద్ది కాలంగా సరైన సినిమా పడక కెరీర్ పరంగా కాస్త గ్యాప్ తీసుకున్నారు. వరుస ఫ్లాపులు, అసలు షారుఖ్ నుండి ఇలాంటి సినిమానా? అంటూ ప్రేక్షకులు పెదవి విరిచేలా, కనీసం పెట్టుబడి కూడా రాాబట్టలేకుండా డిజాస్టర్ కా బాప్ అనిపించేలా చేసిన కొన్ని చిత్రాలు.. దీంతో ఎటూ పాలుపోక కొంచెం బ్రేక్ తీసుకున్నారు. కట్ చేస్తే.. గోడకి కొట్టిన బంతిలా అంతే వేగంగా బాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ మాటకొస్తే వరల్డ్ బాక్సాఫీస్ మీద దండయాత్ర స్టార్ట్ చేశారు.

అప్పుడు పనైపోయింది అన్నవాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తుంటే మౌనంగా ఓ చిన్న చిరునవ్వి నవ్వి ఊరుకుంటున్నారు కింగ్ ఖాన్.. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ నటించిన అడ్వంచరస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పఠాన్’.. దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా, జాన్ అబ్రహాం విలన్‌గా నటించగా.. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ ఫిలిం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్, ఊహించని వసూళ్లుతో బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది. కొద్ది కాలంగా సరైన సినిమా లేక అల్లాడిపోతున్న బాలీవుడ్ ఇండస్ట్రీ పరువు కాపాడాడు ‘పఠాన్’.

‘బాహుబలి 2’, ‘కె.జి.యఫ్ 2’ కలెక్షన్లను క్రాస్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు ‘పఠాన్’. ఐదవ రోజుకే రూ. 500 కోట్ల మార్క్ టచ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిందీ మూవీ. షారుఖ్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాక హిందీ పరిశ్రమకు కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చి.. సరికొత్త ఆశల్ని చిగురింప చేశాడు. సినిమా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందనేది ముఖ్యం కాదు.. మీ ప్రేమాభిమానాలే నాకు ముఖ్యం అంటూ ప్రేక్షకాభిమానుల మనసుల్ని దోచుకున్నాడు కింగ్ ఖాన్.

ఇదిలా ఉంటే.. 2011లో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘దూకుడు’ చిత్రంతో ఇంలాటి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ‘అతిథి’ తర్వాత మూడేళ్లకు ‘ఖలేజా’ వంటి డిజాస్టర్ ఇచ్చిన మహేష్.. 2011లో సరైన సినిమా లేక డీలా పడ్డ టాలీవుడ్‌కి ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్‌తో కొత్త కళ తీసుకొచ్చారు. రికార్డ్ రేంజ్ కలెక్షన్లతో పాటు పలు అవార్డులు, రివార్డులు అందుకుంది ‘దూకుడు’.. షారుఖ్ – మహేష్ ఇద్దరూ తాము కమ్ బ్యాక్ ఇవ్వడమే కాక పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు..

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus