ఆ దర్శకుడికి షాక్ ఇచ్చిన మహేష్!!!

టాలీవుడ్  టాప్ హీరోస్ లో మహేష్ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అదే క్రమంలో టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అదలా ఉంటే…తాజాగా మహేష్ బాబు తమిళ దర్శకుడు మురుగుదాస్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ లో నటిస్తూ ఉన్నాడు. ఇటు తెలుగులోని…అటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు మన ప్రిన్స్.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఆతరువాత ప్రిన్స్ చెయ్యబోయే సినిమా గురించి ఇప్పటికే దాదాపుగా ‘వంశీ పైడిపల్లి’ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది అని టాక్స్ మొదలయ్యాయి. అయితే ఏమయ్యిందో ఏమో తెలీదు కానీ….ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సల్ అయ్యీ, ఆ స్థానంలో ప్రిన్స్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం….ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన ప్రకారం….ఊపిరి హిట్ తో పివిపి మళ్లీ వంశీని మహేష్ తో సినిమా తీసేలా ప్లాన్ చేశాడు.

ఆ కాంబినేషన్ కోసం చాలా వర్కౌట్ చేశాడు. కొరటాల శివ తర్వాత మహేష్ వంశీ సినిమానే చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కాని మధ్యలో త్రివిక్రం వచ్చి ఓ అదిరిపోయే కథ చెప్పడంతో వంశీకి మళ్లీ హ్యాండ్ ఇచ్చాడట మహేష్. మహేష్ 25వ సినిమాగా రాబోతున్న ఆ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండాలనే ఉద్దేశంతో త్రివిక్రంతో కలిసి చేస్తేనే బెటర్ అని మహేష్ అనుకుని ఇలా చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా…తన కోసం సంవత్సరం వెయిట్ చేస్తా అని చెప్పిన వంశీకి మహేష్ షాక్ ఇచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus