Mahesh Babu: ఆ ఇండస్ట్రీపై సూపర్ స్టార్ దృష్టి పెడతారా?

  • December 18, 2021 / 05:41 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో జోరుమీదున్నారు. మహేష్ నటించిన సర్కారు వారి పాట వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. సినిమా రంగంలో సూపర్ స్టార్ గా మహేష్ బాబు కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు. చరణ్. ఎన్టీఆర్ లకు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు రావడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట పాన్ ఇండియా మూవీ కాదని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా మూవీ అని కన్ఫామ్ అయినా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ లేదు. మహేష్ బాబు బాలీవుడ్ పై దృష్టి పెట్టాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలీవుడ్ లో సక్సెస్ సాధిస్తే మహేష్ బాబు మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా హీరోగా మహేష్ క్రేజ్ ను సంపాదించుకుంటే చూడాలని ఉందని మహేష్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కే ఛాన్స్ ఉన్నా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. పక్కా కమర్షియల్ కథలను ఎంచుకుంటూ మహేష్ బాబు కెరీర్ ను కొనసాగిస్తున్నారు. మహేష్ బాబు భార్య నమ్రతకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus