డేరింగ్ స్టెప్ తీసుకోబోతున్న మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు పండగే..!

  • October 26, 2020 / 01:10 PM IST

మహేష్ బాబు హీరోగా ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ చిత్రం షూటింగ్ ను నవంబర్ నుండీ అమెరికాలో మొదలుపెట్టాలని నిర్మాతలు భావించారు. కానీ చిత్ర యూనిట్ సభ్యులకు వీసాల సమస్య తలెత్తడంతో … ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఫోన్ చేసి కాల్ షీట్లు క్యాన్సిల్ చేసుకోమని చెప్పారట దర్శక నిర్మాతలు.

దీంతో ఈ చిత్రం ఆగిపోయినట్టే అనే ప్రచారం మొదలైంది.అంతేకాదు మహేష్ కూడా ఈ చిత్రాన్ని పక్కనపెట్టేసి త్రివిక్రమ్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళాలి అని భావిస్తున్నాడని కూడా టాక్ నడిచింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదు.2021 జనవరి 2 లేదా సంక్రాంతి పూర్తయిన తరువాత ‘సర్కారు వారి పాట’ షూటింగ్ అమెరికాలో మొదలుకానుందట. ఈ లోపు మహేష్ బాబు- త్రివిక్రమ్ ల సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదా…

ఆ చిత్రం షూటింగ్ మొదలుపెట్టడం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏమైనా ఓ స్టార్ హీరో ఒకేసారి రెండు పెద్ద సినిమాలను మొదలుపెట్టడం అంటే డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. ‘అతడు’ సినిమా వరకూ మహేష్ బాబు ఒకేసారి రెండేసి సినిమాల్లో నటిస్తూ వచ్చేవాడు. కానీ ఆ చిత్రం తరువాత అతను పెద్ద స్టార్ అయ్యాడు. అప్పటి నుండీ ఇలా రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొన్నది లేదు.ఏమైనా ఆయన ఫ్యాన్స్ కు అయితే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus