Mahesh, Trivikram: మళ్ళీ మహేష్ – త్రివిక్రమ్ కాంబో.. ఈసారి ఇంకాస్త స్పెషల్ గా..!?

  • June 18, 2024 / 02:59 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఈ ఏడాది ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. కానీ ఆశించిన బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయింది. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా రూ.300 కోట్లు రాబట్టిన రీజనల్ మూవీగా రికార్డులకెక్కేది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. మహేష్ – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ పై జనాలకి ఉన్న మోజు అలాంటిది.

‘అతడు’ (Athadu) ‘ఖలేజా’ (Khaleja) బ్లాక్ బస్టర్స్ కొట్టకపోయినా.. వాటిని అమితంగా ఇష్టపడి వీక్షించే ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. అందుకే ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోయినా ఈ కాంబినేషన్ పై క్రేజ్ ఎక్కువ. సరే ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ బాబు .. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. దాని కోసం కసరత్తులు చేస్తున్నారు. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కనుంది ఈ క్రేజీ ప్రాజెక్ట్.

అయితే మహేష్ 30 వ సినిమా సంగతి ఏంటి? ఏ దర్శకుడితో ఆ ప్రాజెక్టు ఉంటుంది అనే డౌట్ కూడా అందరిలో ఉంది. దీని కోసం సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, కొరటాల శివ వంటి టాప్ డైరెక్టర్లు రెడీగా ఉన్నారు.ఈ లిస్ట్ లోనే అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు. ‘మహేష్ 30 ‘ సంగతి ఎలా ఉన్నా ‘మహేష్ 31 ‘ మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుందట. ‘గుంటూరు కారం’ టైంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిస్కషన్స్ జరిగిపోయాయని వినికిడి.

ఈసారి మహేష్, త్రివిక్రమ్ కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తారట. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో (Allu Arjun) చేయబోయే స్క్రిప్ట్ పై పనిచేస్తున్నారు. దాని తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్టు ఉండవచ్చు. మహేష్ – రాజమౌళి (Rajamouli) సినిమా వచ్చేలోపు.. వాటిని త్రివిక్రమ్ అవలీలగా కంప్లీట్ చేసేస్తాడు. సో మహేష్ – త్రివిక్రమ్ కాంబో సెట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి అనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus