మెగా హీరోకు అడ్డుగా మహేష్!!!

ఒకరు టాలీవుడ్ టాప్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు…మరొకరు…మెగా యంగ్ హీరో సాయి ధర్మ తేజ…అయితే వీళ్ళిద్దరూ కలసి ఒక అందాల భామ కోసం పోటీ పడుతున్నారు..ఇంతకీ ఎవరా భామ? ఏంటి ఆ కధ అంటే….ఈ స్టోరీ చదవాల్సిందే…విషయంలోకి వెళితే…మెగా సుప్రీం హీరో సాయి ధర్మ తేజ హీరోగా, ఠాగూర్ మధు నిర్మాతగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లోప్లాన్ చేస్తున్న సినిమాకు కధను రెడీ అయిపోయింది.

అదే క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ గా మన అందాల బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ని సైతం భారీ పారితోషకం ఇచ్చి మరీ ఒకే చేసేసారు. అదే క్రమంలో ఈ సినిమా ఆగష్టు, లేదా సెప్టెంబర్ నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం. సాయి కు షాక్ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్..ఏంటి ఆ షాక్ అంటే….మహేష్ మురగదాస్ కాంబినేషన్ లో రూపొందబోతున్న భారీ సినిమాకు రకుల్ హీరోయిన్ గా ఎంపిక అయిన నేపధ్యంలో ఇప్పడు రకుల్  సాయి ధరమ్ తేజ్ తో  తాను నటించబోయే సినిమాను వదులు కొబోతున్నట్లు గా వార్తలు వస్తున్నాయి.

ఎప్పటి నుంచో మహేష్ తో నటించాలి అన్న కోరికతో ఉన్న రకుల్ తన డేట్స్  సర్దు బాటు కోసం సాయి ధరమ్ తేజ సినిమాకు ఆల్రెడీ ఇచ్చిన తన డేట్లు మహేష్ సినిమా కోసం సర్దుబాటుచేయబోతోంది అన్న వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఈ పరిణామాన్ని అంతా గమనించిన సాయి పాపం ఇప్పటివరకు ఏ టాప్ హీరోయిన్ తో ను నటించని తాను, రకుల్ పై పెట్టుకున్న ఆశలు ఆవిరి అయి పోతోన్నందుకు ప్రిన్స్ తో కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా…ప్రిన్స్ రేంజ్ అంటే అది మరీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus