శ్రీకాంత్ అడ్డాల కి వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు

శ్రీమంతుడు సినిమా హిట్ తో మంచి ఊపు మీదున్న మహేష్ బాబు తాజాగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఆ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కు హీరో మహేష్ బాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడని అత్యంత విశ్వసనీయ సమాచారం.  ‘బ్రహ్మోత్సవం’ సినిమా విషయం లో ఈ డైరెక్టర్ మహేష్ బాబు కి చుక్కలు చూపిస్తున్నాడని టాక్. కొంతమంది డైరెక్టర్స్ ఎంత టాలెంటెడ్‌ అయిన కొన్ని సార్లు సినిమాని సెట్స్ మీదికి తీసుకేల్లెటప్పటికి కన్ఫ్యూజ్‌ అవుతుంటారు. శ్రీకాంత్ అద్దాల కూడా ఇలాగే అయోమయం లో ఉన్నాడని వినికిడి. వివరాల లోనికి వెళితే…

డైరెక్టర్ శ్రీకాంత్ అద్దాల కథ ఒకటి చెప్పి సినిమా ని మరోలా తీస్తున్నాడట. అసలు పేపర్ లో రాసుకున దానికి నువ్వు తీస్తున్న దానికి సంబంధం లేదని, నువ్వు చెప్పింది ఒకటి తీస్తున్నది ఇంకొకటి, కథ కి తీస్తున్న సీన్స్ కి సంబంధం లేదని శ్రీకాంత్ అడ్డాల మీద మహేష్ బాబు ఫైర్ అయిపోయాడని, దీనికి తోడూ సినిమా లెంత్  కూడా పెరిగి పోతుందని మహేష్ తెగ బాధ పడిపోతున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. అసలు ఈ విషయం పై మహేష్ చాల సార్లు అప్‌సెట్‌
అయ్యాడని  ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొంటున్నారు. అందువల్లనే ఏప్రిల్ కి రావాల్సిన సినిమా మే కి పోస్ట్ పోన్  అయ్యిందని వినికిడి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus