విజయ్ ను మహేష్ లాక్ చేశాడా?

వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ హీరోల కాల్షీట్లని తెలివిగా లాక్ చేసి.. సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కొట్టి క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది బడా నిర్మాతలు. ఈ లిస్ట్ లో అల్లు అరవింద్, సురేష్ బాబు, నాగార్జున ఉన్నారు. ఇక ఇప్పుడిప్పుడే నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న స్టార్ హీరో మహేష్ బాబు కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాడట. ‘ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో మహేష్, నమ్రతలు యంగ్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారని గత కొంతకాలం నుండీ వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అడివి శేష్ లాంటి ట్యాలెంటెడ్ హీరోని లాక్ చేశారు.

ఇప్పుడు విజయ్ దేవరకొండ ను కూడా లాక్ చేసినట్టు సమాచారం. అందుకే ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుకకి విజయ్ దేవరకొండని ఆహ్వానించాడని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ చిత్రం తర్వాత ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక ‘మైత్రి మూవీ మేకర్స్ సంస్థ’ కు కూడా ‘హీరో’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక మహేష్ కే తన కాల్షీట్లు ఇవ్వబోతున్నాడట. ఈ ప్రాజెక్ట్ బాధ్యతలన్నీ నమ్రత దగ్గరుండి చూసుకోబోతున్నారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus