భరత్ అనే నేను బహిరంగ సభకు సర్వం సిద్ధం, మహేష్ బాబు స్వయంగా పిలవడంతో ఎన్టీయార్ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పోలిటికల్ డ్రామా చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ను తొలుత విశాఖపట్నంలో, తర్వాత విజయవాడలో నిర్వహించడానికి సన్నాహాలు చేసినప్పటికీ.. అవేవీ వర్కవుట్ అవ్వకపోవడంతో ఆఖరికి హైద్రాబాద్ లోనే నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. పోలిటికల్ సినిమా కావడంతో ఎల్బీ స్టేడియంలో ఓ భారీ సభలా నిర్వహించాలనుకొన్నారు.శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సర్వసన్నాహాలు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్న “భరత్ అనే నేను” బృందానికి నిన్నట్నుంచి పెద్ద భయం పట్టుకుంది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వరుణుడి ప్రతాపాన్ని చూసిన చిత్రబృందం.. ఒకవేళ ఇవాళ సాయంత్రం కూడా వర్షం పడితే పరిస్థితి ఏమిటా అని కంగారు పడుతున్నారు.
అసలే ఓపెన్ స్టేడియం, ఆపై వేల మంది జనాలు వచ్చే అవకాశామ్ పుష్కలంగా ఉండడం, ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుల అభిమానులతోపాటు ఎన్టీయార్ అభిమానులు కూడా భారీ స్థాయిలో తరళి వచ్చే అవకాశాలు ఉండడంతో పొరపాటున నిన్న పడిన వర్షంలో సగం పడినా ఈవెంట్ ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అని భయపడుతున్నారు. ఇదే ప్రోగ్రామ్ “అజ్ణాతవాసి” తరహాలో ఏ నోవోటెల్ హోటల్ లో నిర్వహించి ఉంటే ప్రకృతి వైపరీత్యానికి ఇంతలా భయపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఏదేమైనా సాయంత్రం వేడుక సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యేవరకూ ఆ వరుణుడు కాస్త కరుణిస్తే బాగుండని అందరూ కోరుకొంటున్నారు.