కారైకుడి కి వెళ్లనున్న భరత్ అనునేను టీమ్!

హ్యాట్రిక్ హిట్ అందుకున్న కొరటాల శివ విజయ పరంపరను కొనసాగించడానికి కష్టపడుతున్నారు. మహేష్ బాబు తో చేస్తున్న భరత్ అను నేను సినిమాకి పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు. గత నెల  హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సిఎం క్యాంప్ ఆఫీస్ సెట్లో కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ షెడ్యూల్  కి బ్రేక్ ఇచ్చి వాణిజ్య ప్రకటన షూటింగ్‌ కోసం మహేష్ యూరప్‌ వెళ్లారు. ఆ టూర్ ముగించుకొని  హైదరాబాద్ కి వచ్చిన మహేష్ నవంబర్ 23 నుంచి తమిళనాడు లోని పొల్లాచి లో మొదలైన షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ తర్వాతి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది.

తమిళనాడులో ‘హెరిటేజ్‌ టౌన్‌’గా పేరొందిన కారైకుడిలో జరుగుతుంది. డిసెంబర్‌ 10 నుంచి ఓ పదిహేను రోజుల పాటు అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కారైకుడి షెడ్యూల్‌తో మూడు పాటలు, ఓ ఫైట్‌ మినహా సినిమా పూర్తవుతుంది. వీటిని వచ్చే ఏడాది మార్చిలో చిత్రీకరించడానికి కొరటాల ప్లాన్‌ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus