సూపర్ స్టార్ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పిన ట్రైనర్లు!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏదైనా పనిలోకి ఎంటరైతే దానిని కంప్లీట్ చేసే వరకు వెనకడుగు వేయరు. అది ప్రొఫిషనల్ లైఫ్ లో కావచ్చు.. పర్సనల్ లైఫ్ లో కావచ్చు. సినిమాల్లో అతను చేసే సాహసాల గురించి అందరికీ తెలిసిందే. అయితే కొత్తగా ప్రిన్స్ వ్యక్తిగత జీవితం గురించి ఓ విషయాన్నీ వెల్లడించారు ఆయన ఫిట్ నెస్ ట్రైనర్లు క్రిస్,  వీరిద్దరూ సూపర్ స్టార్ అథ్లెట్ లుక్ లోకి రావడానికి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు.

ఈ మధ్య వారు హైదరాబాద్ లో జిమ్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో క్రిస్ మాట్లాడుతూ  “మొహం పై ప్రభావం చూపించకుండా బాడీలో మార్పులు రావాలని మాకు మొదట మహేష్ చెప్పినప్పుడు అలోచించి … ఆయనకు టెంపో ట్రైనింగ్ ఇచ్చాము. అందువల్ల ప్రిన్స్ భుజాలు, వెన్ను ప్రాంతాల్లో నొప్పి కలిగింది. అయినా భయపడకుండా మాపై నమ్మకంతో ఎక్సర్ సైజ్ చేశారు.

మంచి ఫలితాన్ని అందుకున్నారు. శ్రీమంతుడులో సిక్స్ ప్యాక్, బ్రహ్మోత్సవంలో కొంచెం బరువు తగ్గి స్లిమ్ అయ్యారు. మురుగదాస్ చిత్రం కోసం అథ్లెట్ లుక్ సాధించారు. ఇదంతా అతని కష్టం, కమిట్మెంట్ వల్లే సాధ్యపడింది.” అని వివరించారు. ఆ లుక్ ని మీరు చూడాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.

Bhanupriya about Pawan Kalyan and Mahesh Babu - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus