మహేష్ ఇలా మారిపోవడానికి కారణం ఏంటి.. ?

అవును ఒకప్పటి టాలీవుడ్ ప్రిన్స్ వేరు… ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వేరు. ఏదేమైనా ఇప్పుడు మహేష్ బాబు పూర్తిగా మారిపోయాడు. ఇది మేము చెబుతున్న మాట కాదు, ఫిలిం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్. అప్పట్లో మహేష్ పబ్లిక్ ఈవెంట్స్, మూవీ వేడుకలు, విజయోత్సవ సంబరాలు వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండేవాడు. ఏదో ఒకటి రెండు మాటలు మాట్లాడడం… తన సినిమాలు వచ్చినప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప మిగిలిన టైంలో అస్సలు కనిపించేవాడే కాదు. 20 ఏళ్ళ మహేష్ కెరీర్ లో ఒక్క వివాదం కూడా లేదంటే.. మహేష్ లైఫ్ స్టైల్ ఏంటనేది అర్ధం చేసుకోవచ్చు.

మరి మహేష్ ఇప్పుడు ఏ విషయంలో మారిపోయాడు అంటే.. తన ట్విట్టర్లో ఎప్పుడూ అభిమానులతో అందుబాటులో ఉంటున్నాడు. తన సినిమాల అప్డేట్ లతో పాటు మిగిలిన హీరోల సినిమాల పట్ల కూడా స్పందిస్తున్నాడు. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా తనకి నచ్చిన ప్రతీ సినిమా పై ప్రశంలు కురిపిస్తున్నాడు. వెంకటేష్, చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి హీరోలతో చాలా సన్నిహితంగా ఉంటూ… ఫ్యామిలీ పార్టీలలో కూడా పాల్గొంటున్నాడు. ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి సమయం కేటాయించి వారితో విదేశాలకు వెళ్తుంటాడు. అంతేకాదు.. రెండు గ్రామాల్ని దత్తత తీసుకుని అక్కడి ప్రజలకి సాయం చేస్తూ వస్తున్నాడు. మొన్నటికి మొన్న 1000 మంది పిల్లలకి ‘హార్ట్ ఆపరేషన్లు’ చేయించి వారికి ఊపిరి పోసాడు. ఇలా మహేష్ చాలా మారిపోయాడు.

1

2

3

4

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus