సాయంలోను మహేష్ నంబర్ వన్!

“సాటి మనిషి కష్టం మనది కాకపోతే ఒక నేల మీద, ఒక సంఘంలో బతకడం ఎందుకు సార్”.. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. తెర మీద డైలాగులు చెప్పడమే కాదు.. నిజ జీవితంలోను రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని బుర్రి పాలెం, తెలంగాణ లోని సిద్ధాపూర్ (మహబూబ్ నగర్) గ్రామాల్లో అన్ని వసతులు కల్పించి స్మార్ట్ విలేజ్ గా మార్చడానికి డబ్బులను ఖర్చు చేస్తున్నారు. అయన గురించి మరో ఆసక్తికర విషయం బయట పడింది.

బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న ఉత్పత్తుల కంపెనీల నుంచి తనకు వచ్చే వార్షిక ఆదాయంలో 30 శాతం ఛారిటీలకు అందించే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిసింది. టాలీవుడ్ హీరోల్లో ఎక్కువ ఎండోర్స్ మెంట్స్ మహేష్  కలిగి ఉన్నారు. అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది. ఈ విధంగా అయన సహాయం కోట్లలోనే ఉంటుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో సూపర్ స్టార్ ఎల్లప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారు.

గతంలో వైజాక్ హుద్ హుద్ తుఫాన్ భాదితులకు 16 కోట్లు అందజేసి మహేష్ మనసు కూడా అందమైందని చాటారు. మహేష్ తో పాటు అతని సతీమణి నమ్రత కొన్ని వృద్ధాశ్రమాల బాగోగులు చూసుకుంటున్నారు. పేద పిల్లల ఆరోగ్యానికి అవసరమయ్యే సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా సూపర్ స్టార్ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus