మహేష్, రకుల్ పై పాట చిత్రీకరిస్తున్న మురుగదాస్

తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ద్విభాషా చిత్రం అభిమానులను ఊరిస్తోంది. తమిళ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వందకోట్ల బడ్జెట్ తో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఓ ప్రయివేట్ స్టూడియోలో వేసిన అందమైన సెట్ లో మహేష్, రకుల్ ప్రీత్ సింగ్ పై ఫాస్ట్ బీట్ సాంగ్ ని మురగదాస్ బృందం తెరకెక్కిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ పాట పూర్తి అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పారు. అనంతరం మిగిలిన సీన్ల చిత్రీకరణకు మళ్లీ ముంబైకి వెళ్లనున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవంలో కొన్ని స్టెప్పులతో నవ్వులపాలైన మహేష్ ఈ సారి అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నట్లు సమాచారం. అందుకోసం కొరియోగ్రాఫర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో డైరక్టర్, నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా తలపడుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ సినిమా జూన్ 23 న రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus