రీల్ లైఫ్ లో ప్రామిస్… రియల్ లైఫ్ లో ఎస్కేప్..ఇది మహేష్ తీరు..!

సాధారణంగా మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నప్పుడే… తన తరువాత ఈ సినిమా పాలనా డైరెక్టర్ తో ఉంటుందంటూ వార్తలు వస్తుంటాయి. వీటిని ఆయా దర్శక నిర్మాతలు కూడా దాదాపు ఖరారు చేసేస్తుంటారు. అయితే మహేష్ ఏ చిత్రాన్ని ఫైనల్ చేస్తాడనేది ఎవ్వరూ ఊహించలేరు. కథ వింటాడు… ఓకే అంటాడు… తను కమిట్ అయిన ప్రొడ్యూసర్లకి కూడా చెప్పేస్తాడు. కానీ చివరి దశలోకి వచ్చేసరికి… ఆ దర్శక నిర్మాతలకి హ్యాండ్ ఇచ్చేస్తాడని ఇండస్ట్రీలో టాక్ ఎప్పుడూ ఉంది. ఇటీవల సుకుమార్ తో ఓ చిత్రం చేయబోతున్నాడని… ఆ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ నిమిస్తారని ప్రచారం కూడా జరిగింది. ఈ నిర్మాతలు తమ సోషల్ మీడియా ప్రొఫైల్ లో కూడా మహేష్ 26 ని నిర్మిస్తున్నట్టు పెట్టేసుకున్నారు. అయితే చివరికి స్క్రిప్ట్ నచ్చలేదని తప్పించుకున్నాడు మహేష్.

ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ కి కూడా మహేష్ మహేష్ హ్యాండిచ్చేసాడట. అసలు విషయం ఏమిటంటే ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తరువాత దర్శకుడు సందీప్ వంగా కు చాలా అవకాశాలు వచ్చినప్పటికీ… అవన్నీ పక్కన పెట్టి మహేష్ బాబు చిత్రం కోసం వెయిట్ చేస్తున్నాడు. మహేష్-సందీప్ ల మధ్య కథా చర్చలు కూడా జరిగిపోయాయి. మహేష్ కి కూడా కథ నచ్చింది త్వరలోనే ఈ చిత్రాన్ని మొదలు పెడదాం అని మహేష్ మాట కూడా ఇచ్చేసాడు. అయితే ఇప్పుడు మహేష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. కథ బాగున్నప్పటికీ, హీరో క్యారెక్టరైజేషన్ తన స్టార్ డం కి ఎఫెక్ట్ అవుతనదేమో అని మహేష్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టేసాడట. భవిష్యత్తులో మరో చిత్రం తప్పకుండా చేద్దాం అని సందీప్ కి చెప్పి.. తప్పించుకున్నాడట. ఇప్పుడు ఈ టాపిక్ పై ఫిలింనగర్లో చర్చమొదలయ్యింది. ఇచ్చిన మాట తప్పకూడదని రీల్ లైఫ్ లో డైలాగులు బాగానే చెప్తాడు.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోడని సోషల్ మీడియా లో కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus