ఖరారైన మహేష్, మురుగదాస్ సినిమా విడుదల తేదీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రిన్స్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అతనికి జోడీగా ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఆడి పాడనుంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ నెల 26 న విడుదల చేయనున్నారు. సంభవామి అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని నిర్మాత ఠాగూర్ మధు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రాత్రి వేళలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి మరో రెండు నెలలు సమయం పడుతుంది.

అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కోసం మూడు నెలలు కేటాయించారు. బ్రహ్మోత్సవం ఫెయిల్ కావడంతో ఈ చిత్రం ఎలాగైనా హిట్ కావాలని సూపర్ స్టార్ చాలా శ్రమిస్తున్నారు. హడావుడి లేకుండా జూన్ 23 న ఈ మూవీని రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. వందకోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus