మహేష్, మురుగదాస్ మూవీపై భారీ క్రేజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. 100 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు గుజరాత్ లోని అహ్మదాబాద్ పరిసరాల్లో  చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇంకా టైటిల్ కూడా నిర్ణయించని ఈ మూవీ శాటిలైట్ హక్కులను జీ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. బ్రహ్మోత్సవం మూవీ శాటిలైట్ హక్కులను  కూడా జీ తెలుగు సంస్థ 11 కోట్లకు దక్కించుకుంది.

ఇప్పుడు మహేష్ 23 వ సినిమా కోసం రెండు రెట్లు అధికంగా చెల్లించింది. అనేక ఛానళ్ల వారితో పోటీపడి జీ గ్రూప్ వారు  తెలుగు, హిందీ(డబ్బింగ్) శాటిలైట్ హక్కులను 26 కోట్లతో సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా ఇంత ధర పలకలేదు. రిలీజ్ కి ముందే మహేష్ మూవీ సంచలనం సృష్టించింది. సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు, నమ్రత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని వేసవిలో విడుదల చేయాలనీ భావిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus