Mahesh, Namrata: మహేష్ బాబు – నమ్రతల వెడ్డింగ్ యానివర్సరీ.. వైరల్ అవుతున్న పోస్టులు..

సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ దంపతులు ఫిబ్రవరి 10న తమ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2005 ఫిబ్రవరి 10న ఏడడుగులు వేసిన ఈ స్టార్ కపుల్.. నేడు తమ 18వ వివాహ వార్షికొత్సవాన్ని జరుపుకోవడానికి స్పెయిన్ వెళ్లారు. గురువారం (ఫిబ్రవరి 9) ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వీరు కెమెరాల కంట పడ్డారు. సాధారణంగా హాలీడే ట్రిప్ అంటే.. భార్య, పిల్లలతో కలిసి వెళ్తుంటాడు మహేష్..

అలాంటిది కేవలం భార్య భర్తలిద్దరే కనిపించడంతో..ఇంత సడెన్‌గా విదేశాలకు ఎందుకు వెళ్తున్నట్టో అనుకున్నారు. కట్ చేస్తే.. అసలు కారణం తెలిసింది. ఏకాంతంగా తమ యానివర్సరీని జరుపుకోవడానికి ఇద్దరు మాత్రమే వెళ్లారు. ఈ సందర్భంగా మహేష్ – నమ్రత చేసిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 18 సంవత్సరాల ప్రేమ, జీవిత ప్రయాణం గురించి తెలియజేస్తూ.. రేర్ ఫోటోలతో వీరిద్దరు పోస్టులు చేశారు.

అలాగే సితార పాప, గౌతమ్ కూడా అమ్మానాన్నలకు పెళ్లి రోజు విషెస్ చెప్తూ పోస్టులు చేశారు. ఫ్యాన్స్, నెటిజన్లు మరియు సినీ పరిశ్రమ వారు మహేష్ – నమ్రత జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus