మహేష్ తోనే రాజమౌళి తర్వాతి సినిమా ఉంటుందా?
- July 24, 2017 / 02:40 PM ISTByFilmy Focus
మహేష్ – రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం ఎన్నాళ్ల నుండో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ చూస్తుంటే రాజమౌళి తర్వాత సినిమా మహేష్ తోనే అని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ మురుగదాస్ తో స్పైడర్ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాకముందే కొరటాల శివతో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు మహేష్. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయినట్టు టాక్. ఇక ఈ సినిమాల తర్వాత మహేష్ కచ్చితంగా రాజమౌళితోనే చేస్తాడని అంటున్నారు.
మహేష్ రాజమౌళి సినిమా కోసం కె.ఎల్ నారాయణ ఇప్పటికే ఇరువురికి అడ్వాన్సులు ఇచ్చి కూర్చుకున్నాడు. ఎన్నాళ్ల నుండో ఈ కాంబో మూవీ వస్తుందని అనుకున్నారు కాని సెట్ అవ్వలేదు. చూస్తుంటే ఈసారి మాత్రం రాజమౌళి మహేష్ తో సినిమా కచ్చితంగా ఫిక్స్ చేసే అవకాశాలున్నాయట. ఇప్పటిదాకా ఎన్.టి.ఆర్, ప్రభాస్, రాం చరణ్, రవితేజ లాంటి స్టార్స్ తో తీసిన జక్కన్న మహేష్ తో ఎలాంటి సినిమా తీస్తాడో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















