మహేష్ ఇచ్చిన మెసేజ్ కు ప్రశంసల వెల్లువ..!

ఎప్పుడైతే కొరటాల శివ డైరెక్షన్లో సినిమాలు చేయడం మొదలు పెట్టాడో.. అప్పటి నుండీ మహేష్ లో సామజిక స్పృహ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి. ‘శ్రీమంతుడు’ సినిమా టైములో రెండు గ్రామాలను దత్తత తీసుకుని వారికి సేవలందించడం మొదలు పెట్టాడు మహేష్. మహేష్ ఇన్స్పిరేషన్ తో చాలా మంది నటీనటులు ఈ మార్గంలోకి వచ్చారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ వంటి వారు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇక ‘భరత్ నేను’ చిత్రంతో మరోసారి కొరటాల శివ డైరెక్షన్లో చేసిన మహేష్ చాలా వరకూ అదే మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. జవాబుదారీ తనం, ప్రామిస్ లాంటి విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్టు కనిపిస్తుండడం విశేషం. 

 

ఇక అసలు విషయానికి వెళ్తే… నేష‌న‌ల్ గర్ల్, చైల్డ్ దినోత్స‌వం సంద‌ర్భంగా మెసేజ్ తో కూడిన పిలుపును మహేష్ ఇచ్చాడు. త‌న ట్విట్ట‌ర్ ఎక్కౌంట్ లో ఆయన సందేశాన్ని పోస్ట్ చేసి, తన అభిమానులను ఎలర్ట్ చేసాడు. మహిళల పై మనదేశంలో వివక్ష ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం .. ఒక పక్క ఈ వివక్షను పోగొట్టడానికి ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. ఈ విషయమై తనవంతు భాధ్యతగా మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా సందేశం పోస్ట్ చేసి జనాల్లో ఎవేర్ నెస్ తెచ్చే ప్రయత్నం చేసాడు. ఇప్పటి వరకు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మరే హీరో ఈ విషయమై స్పందించలేదు..! దీంతో మహేష్ ని అందరూ మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మహేష్ ట్వీట్ చేస్తూ… చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వివక్ష ఎక్కువగా ఉంది. ఆడపిల్లల పై ఈ వివక్షను పోగొట్టాలి, ఈ విషయంలో ప్రతిఒక్కరిలో మార్పు వచ్చేలా మనవంతు ప్రయత్నం కూడా చేయాలని మహేష్ బాబు కోరాడు.ఇదిలా ఉండగా మహేష్ ప్రస్తుతం తన 25 వ సినిమా అయిన ‘మహర్షి’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25 న విడుదల కాబోతుంది.

మహేష్ కూతురితో కోహ్లీ, అనుష్క..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus