Mahesh Babu, Rajamouli: రాజమౌళి సినిమాపై మహేష్ బాబు అలా అన్నారా?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదనే సంగతి తెలిసిందే. హీరోగా వరుస విజయాలు అందుకుంటున్న మహేష్ మేజర్ సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అందుకున్నారు. మేజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన మహేష్ బాబుకు రాజమౌళి సినిమాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

రాజమౌళితో సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆలోచనలను చర్చించామని మహేష్ అన్నారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి దేనిపై క్లారిటీ లేదని ఆయన తెలిపారు. రాజమౌళి సినిమా గురించి ఇప్పుడు మాట్లాడితే త్వరగా మాట్లాడినట్టు అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. రాజమౌళి డైరెక్షన్ లో నటించాలన్న తన కల మాత్రం సాకారం అవుతోందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. తాను రాజమౌళి కలిసి పని చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నామని మహేష్ బాబు తెలిపారు.

అయితే అది త్వరలోనే సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి చాలా ఉత్సుకతతో ఉన్నానని మహేష్ బాబు కామెంట్లు చేశారు. నేను ఏ సినిమా, కథ ఎంచుకున్నా గట్స్ ఫీలింగ్ తో ముందుకు వెళతానని ఆయన తెలిపారు. తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ ను ఎవరితో చర్చించనని మహేష్ బాబు అన్నారు. సినిమాల విషయంలో తన నిర్ణయమే తుది నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు.

శరత్, అనురాగ్ తనతో మేజర్ సినిమా చేస్తున్నామని చెప్పిన సమయంలో నేను ఎవరితో చర్చించలేదని ఇతరులతో చర్చించకుండానే తాను యస్ అని చెప్పానని ఆయన కామెంట్లు చేశారు. మహేష్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాసినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus