మహర్షి రీషూట్ కు ఆదేశాలు జారీ చేసిన మహేష్

చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి సినిమాకి రీషూట్ జరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే.. పేపర్ మీద రాసుకున్న సన్నివేశం తెరమీదకు వచ్చేసరికి ఒక్కోసారి రాసుకొన్నదానికంటే అద్భుతంగా వస్తే.. ఇంకోసారి సరిగా రాకపోవచ్చు. అందుకే ఫస్ట్ కాపీ చూసుకున్నాక బాగా రాలేదు అనుకొన్న సన్నివేశాల్ని రీషూట్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం “మహర్షి” విషయంలోనూ అదే జరుగుతోంది.

మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల తేదీని ప్రకటించబడి, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అయితే.. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ తో నిర్మాతలతోపాటు మహేష్ బాబు కూడా సాటిస్ఫై అవ్వకపోవడంతో చాలా సన్నివేశాలను మరీ రీషూట్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. దాంతో.. ముందు ప్రకటించినట్లుగా ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయడం కష్టమని తెలుస్తోంది. సో సమ్మర్ రేస్ నుంచి మహేష్ మళ్ళీ అవుట్ అనే అనిపిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus