Mahesh Vitta: ‘బిగ్ బాస్’ మహేష్ విట్టా చెల్లెలు పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

పలు షార్ట్ ఫిలిమ్స్ మరియు కామెడీ వీడియోల ద్వారా పాపులర్ అయిన మిల్కీ మహేష్ అలియాస్ మహేష్ విట్టా.. అటు తర్వాత పలు సినిమాల్లో కూడా నటించాడు. ‘కృష్ణార్జున యుద్ధం’ ‘శమంతకమణి’ ‘ఛలో’ ‘టాక్సీ వాలా’ ‘నిను వీడని నీడను నేనే’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ఎంట్రీ ఇచ్చి.. నిత్యం గొడవలతో వార్తల్లో నిలిచేవాడు. ‘వాళ్ళ మాటలు వీళ్ళ దగ్గర.. వీళ్ళ మాటలు వాళ్ళ దగ్గర చెప్పి పుల్లలు పెడుతుండేవాడు’ అంటూ తోటి కంటెస్టెంట్లు ఇతని పై మండిపడేవాళ్ళు.

ఇతను టాప్ -5 లో అయితే నిలవలేదు కానీ అగ్రెసివ్ నేచర్ వల్ల ఇతను నిజాయితీగా కనిపించడం వల్ల.. రెండు నెలల పాటు హౌస్ లో ఉండేలా ప్రేక్షకులు హెల్ప్ చేశారు. అయితే ‘బిగ్ బాస్’ తర్వాత ఇతనికి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. ‘కొండపొలం’ ‘రొమాంటిక్’ ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాల్లో నటించాడు. కానీ అవి పెద్దగా గుర్తుండిపోయే పాత్రలు కాదు. ఇదిలా ఉండగా.. మహేష్ విట్టా ‘పుష్ప’ సినిమాలో కేశవ పాత్రను మిస్ చేసుకున్నట్టు మొన్నామధ్య చెప్పి వార్తల్లో నిలిచాడు.

నిజంగా ఆ పాత్ర కనుక ఇతను చేసుంటే కచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడేమో. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తాజాగా మహేష్ విట్టా తన చెల్లెలు భారతి విట్టా పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus