పుష్ప మూవీ షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన మహేష్ విట్టా!

పుష్ప ది రైజ్ లో పుష్పరాజ్ పాత్ర తర్వాత ఆ స్థాయిలో హైలెట్ గా నిలిచిన పాత్ర కేశవ పాత్ర మాత్రమేననే సంగతి తెలిసిందే. జగదీష్ అనే నటుడు ఆ పాత్రను అద్భుతంగా పోషించారు. అయితే ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మహేష్ విట్టాను మొదట ఈ పాత్ర కోసం పరిశీలించారని సమాచారం. 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప ది రైజ్ వల్ల నిర్మాతలకు లాభాలు రాలేదని సమాచారం.

భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కడం ఈ సినిమాకు ఒక విధంగా మైనస్ అయిందని తెలుస్తోంది. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంతో ఆ ప్రభావం పుష్ప సినిమా కలెక్షన్లపై పడిందని సమాచారం. బిగ్ బాస్ షో ద్వారా, సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న మహేష్ విట్టా పుష్ప సినిమాలోని కేశవ పాత్ర కొరకు తాను అడిషన్ కు వెళ్లానని తనకు పాత్ర గురించి వివరించడంతో పాటు సన్నివేశాలు చెప్పారని అన్నారు.

అయితే ఆ తర్వాత మళ్లీ తనను పిలవలేదని ఆ విధంగా ఆ పాత్ర తనకు దక్కలేదని మహేష్ విట్టా తెలిపారు. పుష్ప సినిమాను తాను చూశానని నాకు చెప్పిన సన్నివేశాలే సినిమాలో ఉన్నాయని తెలిపారు. చితూరు వాళ్ల కంటే బన్నీబాగా డైలాగ్స్ చెప్పారని మహేష్ విట్టా చెప్పుకొచ్చారు. చిత్తూరు యాసలో మహేష్ విట్టా అద్భుతంగా డైలాగ్స్ చెబుతారనే సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల షూట్ కావడంతో తనను ఎంపిక చేసి ఉండకపోవచ్చని మహేష్ విట్టా అభిప్రాయపడ్డారు.

మరోవైపు పుష్పలో కేశవ పాత్ర పోషించిన జగదీష్ కు సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయని సమాచారం. మల్లేశం, పలాస సినిమాలలో చిన్నచిన్న పాత్రలు పోషించిన కేశవ కెరీర్ కు పుష్ప సక్సెస్ ప్లస్ అయింది. పుష్ప సక్సెస్ చాలామంది నటులకు కలిసొచ్చింది. అతి త్వరలో పుష్ప ది రూల్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus