రేపటి నుంచి కొరటాల శివ షూటింగ్లో జాయిన్ కానున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ మూవీ రెండు పాటల మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయిపోయింది. ఈ షూటింగ్ లో ఉండగానే మహేష్ నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలెట్టారు. శ్రీమంతుడు వంటి హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు 24 వ మూవీ చేస్తున్నారు. “భరత్ అను నేను” అనే టైటిల్ ఖరారు చేసిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ గతవారం హైదరాబాద్లో జరిగింది. మహేష్ బాబు లేకుండా ఈ చిత్రీకరణ సాగింది. మహేశ్ పాత్ర చిన్నప్పటి సన్నివేశాలను మాస్టర్ జాయ్ పై తీశారు. రేపటి నుంచి రెండో షెడ్యూల్ మొదలుకాబోతోంది. ఈ షెడ్యూల్లో మహేష్ పాల్గొననున్నారు.

ఇందుకోసం హైదరాబాద్ సిటీ శివార్లలో ఒక భారీ అసెంబ్లీ సెట్ వేశారు. ఈ సెట్ లో మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలిసింది. అంతేకాదు అసెంబ్లీలో ప్రతిపక్షం వారిపై వేసే పంచ్ లు భలే ఉంటాయని సమాచారం. ఆ సీక్వెన్స్ ని మొదటిగా కంప్లీట్ చేయాలనీ కొరటాల శివ ఫిక్స్ అయ్యారు. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా ఎంపికైంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus