మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రం మే 9 న విడుదల కాబోతుంది. ఇది మహేష్ బాబుకి 25 వ చిత్రం కాబట్టి భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇక ఈ చిత్రం తర్వాత తన 26 వ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయాలనీ మహేష్ ఫిక్సయ్యాడు. ఈ చిత్రాన్ని మొదట దిల్ రాజే నిర్మించాలని ముందుకొచ్చాడు. అయితే మహేష్ తో ’14 రీల్స్ ప్లస్’ సంస్థ అధినేత అనిల్ సుంకర కి ఓ చిత్రం కమిట్మెంట్ ఉండడంతో ఆయన్ని కూడా ఈ ప్రాజెక్ట్ లోకి యాడ్ చేసాడు మహేష్ బాబు. దీని పై దిల్ రాజు కాస్త అసంతృప్తిగా ఉన్నప్పటికీ అనిల్ రావిపూడి, మహేష్ లతో మరో చిత్రం చేయించుకోవచ్చని.. ఇప్పటివరకూ ఓపికగా ఉన్నాడట.
అయితే ఏమయ్యిందో ఏమో… ఈ ప్రాజెక్ట్ నుండీ దిల్ రాజు తప్పుకున్నాడని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం స్క్రిప్ట్ విషయంలో, ప్లానింగ్ విషయంలో సహా నిర్మాత కాస్త ఎక్కువగా ఇన్వాల్వయ్యి దిల్ రాజు మాటను లెక్కచేయకపోవడంతో… ఇలా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. 6 నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తిచేసేస్తానని దర్శకుడు అనిల్ రావిపూడి భరోసా ఇవ్వడంతోనే దిల్ రాజు ముందుకొచ్చాడట. అయితే అనిల్ సుంకర మాత్రం చిన్న చిన్న షెడ్యూల్స్ ను కూడా విదేశాల్లో భారీగా చేద్దామని చెప్పడం… దీనికి మహేష్ కూడా అలాగే గ్రాండ్ చేద్దామని చెప్పడం.. దిల్ రాజు కు ఇబ్బందిగా మారిందట. సినిమాలో వచ్చే చిన్న చిన్న సీన్లకి కూడా అంత డబ్బు, టైం వేస్ట్ చేయడం ఎందుకు అని దిల్ రాజు ప్రశ్నించినా మహేష్ మాట వినట్లేదట. దీంతో మహేష్ కి దండం పెట్టేసి.. ఇక భరించలేక ఈ ప్రాజెక్ట్ నుండీ బయటకి వచ్చేసాడని తెలుస్తుంది. మహేష్ బాబు కి కూడా అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేసి.. తన సినిమాకి విచ్చల విడిగా ఖర్చుపెట్టిసే నిర్మాతల అయితేనే నెత్తినెక్కించుకుంటాడని ఇండస్ట్రీలో ఎప్పటినుండో టాక్ ఉంది. ఇప్పడు అది మరోసారి నిజమయ్యింది అంటూ ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.