మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ న్యూ షెడ్యూల్ డీటైల్స్

ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టొరీ, కమర్షియల్ అంశాలతో పాటు ఓ సోషల్ మెసేజ్ కూడా చూపించిన ‘శ్రీమంతుడు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’. ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్. సంక్రాంతి తర్వాత జనవరి 19 నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైందని ఇది వరకే తెలిపాము. ఈ షెడ్యూల్ నిన్నటితో పూర్తయ్యింది.

ఈ వారం రోజుల షెడ్యూల్ తర్వాత మూడు రోజులు గ్యాప్ తీసుకొని మహేష్ బాబు తదుపరి షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్లో జనవరి 27 నుంచి న్యూ షెడ్యూల్ మొదలు కానుంది. ఈ గ్యాప్ వలన మహేష్ బాబు ఈ రోజు జరిగే ఐఫా ఉత్సవమ్ వేడుకలకి కూడా హాజరు కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 60% షూటింగ్ ని ఫినిష్ చేసుకుంది. మహేష్ బాబు సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పివిపి బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus