నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ‘మజిలీ’..!

నాగ చైతన్య, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ‘మజిలీ’. ఏప్రిల్ 05 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతుంది. వరుస ప్లాపులతో సతమవుతున్న నాగచైతన్య ‘మజిలీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడనే చెప్పాలి. ‘మనం’ లాంటి మల్టీ స్టారర్ కాకూండా.. మొదటిసారి తన కెరీర్లో 30 కోట్ల షేర్ మార్క్ కు చేరుకున్నాడు. ‘షైన్ క్రియేషన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేసాడు. నాగచైతన్య, సమంత పెళ్ళైన తరువాత మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం కాబట్టి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కు తగినట్టుగానే మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. ఇక 11 రోజులకి గానూ ‘మజిలీ’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 10 కోట్లు
సీడెడ్ – 3.31 కోట్లు
వైజాగ్ – 3.75 కోట్లు


ఈస్ట్ – 1.51 కోట్లు
కృష్ణా – 1.68 కోట్లు
గుంటూర్ – 1.92 కోట్లు


వెస్ట్ – 1.17 కోట్లు
నెల్లూరు – 0.72 కోట్లు
———————————————
ఏపీ +
తెలంగాణ – 24.06 కోట్లు

రెస్ట్ ఆఫ్
ఇండియా – 2.95 కోట్లు
ఓవర్సీస్ – 3.05 కోట్లు
———————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 30.06 కోట్లు (షేర్)
————————————————-

‘మజిలీ’ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ 22 కోట్లు జరిగింది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 30.06 కోట్ల షేర్ ను వసూళ్ళను రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ స్టేటస్ దక్కింది. విడుదలయ్యి 2 వారాలవుతున్నప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లు స్టడీ గా ఉండటం విశేషం. ఈ చిత్రంతో నాగచైతన్య మొదటి సారి 30 కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పటి వరకూ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్లు వచ్చిన చిత్రం ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ 28 కోట్ల షేర్. ఇప్పుడు ‘మజిలీ’ చిత్రం ఆ కలెక్షన్లను దాటేసి.. చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి ఫుల్ రన్ లో ‘మజిలీ’ చిత్రం ఎంత వసూల్ చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus