మజిలీ చిత్రీకరణ దృశ్యాలు లీక్ కావడంతో షాక్ తిన్న సమంత

క్రేజీ కాంబినేషన్లో సినిమా మొదలయిందంటే.. ఆ చిత్ర బృందానికి కష్టాలు మొదలయినట్టే. అభిమానుల అంచనాలకు తగినట్టు సినిమాని తెరకెక్కించడమే కాదు… తీసిన సినిమాని లీక్ కాకుండా కాపాడుకోవడం కోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అరవింద సమేత సినిమా సెట్స్ మీద ఉండగానే అనేక సార్లు లీక్ కి గురైంది. ఇప్పుడు అదే ఇబ్బంది మజిలీ చిత్ర బృందం పడుతోంది. పెళ్ళికి ముందు సమంత చైతూ తో కలిసి ఏమాయె చేసావే, ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల్లో నటించింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నతర్వాత తొలిసారి ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా ఈ సినిమాకి మజిలీ అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారు. వీరిద్దరూ విహారంలో ఉండగానే శివ నిర్వాణ మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. సెకండ్ షెడ్యూల్పె రీసెంట్ గా హైదరాబాద్ లో మొదలయింది. ఇందులో చైతూ, సమంత పాల్గొన్నారు. అలా సెట్ లోకి అడుగుపెట్టారో లేదో.. ఇలా వారిద్దరి చిత్రీకరణ దృశ్యాలు నెట్ లో ప్రత్యక్షం మయ్యాయి. ఈ వీడియో చూసి సమంత షాక్ తింది. దీంతో చిత్ర బృందం మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టింది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్థలు వచ్చాయని కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus