భార్య గొప్పతనం చెప్పే ‘మజిలీ’..!

నాగ చైతన్య – సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మజిలీ’. పెళ్ళైన తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ డైరేక్షన్లో ఈ చిత్రం తెరకెక్కింది. ‘షైన్ క్రియేషన్స్’ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించాడు. దివ్యాంశ కౌశిక్ కూడా ఓ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5 న విడుదల కాబోతుంది.

‘భర్తే ప్రాణం అని నమ్మే ఓ మంచి అమ్మాయి, ప్రేమలోనూ,జీవితంలోనూ ఫెయిలయిన ఓ క్రికెటర్ జీవితంలోకి.. భార్యగా వస్తే..? అతనికి ఎలా ఉంటుందో తెలియదు గాని, ఆ అమ్మాయికి మాత్రం టార్చర్ కనబడుతుంది.అయితే ఆ తరువాత ఆ అమ్మాయి కారణంగానే అతని లైఫ్ ఎలా మారింది, తిరిగి అతను జీవితంలో ఎలా ఎదిగాడు అనే పాయింట్ బేస్ చేసుకుని’ ఈ చిత్రాన్ని తెరేక్కించానని డైరెక్టర్ శివ నిర్వాణ చెబుతున్నాడు. సమంత – నాగ చైతన్య నటన ఈ చిత్రానికే హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నాడు. మొత్తానికి ఈ చిత్రం భార్య గొప్పదనం ఎలాంటిదో చెబుతుందట. రిలీజ్ దగ్గర కావస్తుండడంతో ఈ చిత్ర ప్రమోషన్లను పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే చైసామ్ ‘మజిలీ’ చిత్రం కోసం గురించి తెగ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన భర్త(చైతూ) ఫ్లాపుల్లో ఉండడంతో ఈ చిత్రంతో తనని ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కించాలని సమంత చాలా ప్రయత్నిస్తుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus